వేల్పూర్ మండలం మోతే గ్రామానికి చెందిన మాదిగ కుటుంబాల భూమికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో దళిత సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు దళిత సంఘాల నాయకుడు కండే కాంతి కుమార్ ఆధ్వర్యంలో తహసిల్దార్ ఆంజనేయులుకు వినతి పత్రం అందజేశారు. మోతే గ్రామంలో మాదిగ కుటుంబానికి చెందిన భూమిని గతంలో స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ కబ్జా చేసిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. అడ్డుకున్న వారిపై దాడులు చేయడమే కాకుండా గ్రామ బహిష్కరణ చేశారన్నారు. రెండు రోజుల క్రితం పంట భూమిని చదును చేసి పంటను, పంట భూమిలో ఉన్న కంచెను ధ్వంసం చేసిన మోతే గ్రామ అభివృద్ధి కమిటీపై కేసు దినములు చేసి మాదిగ కుటుంబాల భూమికి రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కనగర్తి అశోక్, ఎర్ర రాజు,మేకల శేఖర్, ఏగంటి పృథ్వి, తదితరులు పాల్గొన్నారు.