ఆనవాళ్లు మాయం..

నవతెలంగాణ – చివ్వేంల :- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో రోగులకు పంపిణీ చేయవలసిన మందులు దహనం చేశారు. విచారణ కోసం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ హర్షవర్ధన్ హాస్పిటల్ కి వచ్చే వరకు మందులను దహనం చేసిన ఆనవాళ్లు మాయం చేశారు. ఈ సంఘటన విషయమై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాద్యుల పైన చర్యలు తీసుకుంటారా లేక స్థానిక సిబ్బందికి మద్దతుగా నిలుస్తారా వేచి చూడాలి.