నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంఘలో శుక్రవారం అత్యధిక సంఖ్యలో భక్తుల పాల్గొని తమ పుణ్య స్థానాలను ఆచరించారు. శుక్రవారం కావడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో విచ్చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. బాబ్లీ గేట్లను ఎత్తివేయడంతో నీటి ప్రవాహం పెరగడం వల్ల భక్తులు గోదావరిలోకి వెళ్లకూడదని అప్రమత్తం చేశారు. భక్తులు గోదావరిలోనున్న రాతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి తీరాన ఉన్న ఆలయాలను వారి సందర్శించి మొక్కలు తీర్చుకున్నారు. గోదావరి ప్రధాన ఘట్ల వద్ద చెత్తాచెదారం నిండి ఉండడంతో భక్తులు పుణ్యస్థలం ఆచరించడానికి నాన్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనీ భక్తుల పేర్కొన్నారు. గాట్ల పై పేరుకొని ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలని వారు కోరుతున్నారు.