పదవికాలం ముగిసినా, ప్రజల కోసం తాజా మాజీ సర్పంచ్ కృషి

– గ్రామస్తులకు ఫిల్టర్ వాటర్ సరఫరా
నవతెలంగాణ –  మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గ గ్రామ సర్పంచ్ బాబురావు పటేల్ తన సర్పంచ్ పదవి కాలం ముగిసినప్పటికీ, ఆ గ్రామ ప్రజల కోసం మంచినీటిని అందించేందుకు ఫిల్టర్ వాటర్ సౌకర్యాన్ని కల్పించారు. గ్రామ ప్రజల సేవకే నా అంకితం అంటూ తాజా మాజీ సర్పంచ్ బాబురావు పటేల్ పేర్కొన్నారు. సర్పంచ్ కల్పించిన త్రాగునీటి సమస్య పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.