ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్.ఎస్.సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా ఊడుగు సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘1980 రాధే కృష్ణ’. ఎం ఎల్ రాజా సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని తెలుగు, బంజారా భాషల్లో విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా నిర్మాత బెక్కం వేణుగోపాల్, నిర్మాత రామ్ తాళ్లూరి, హీరో సోహెల్, ఆటో రాంప్రసాద్ హాజరై, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నిర్మాత ఊడుగు సుధాకర్ మాట్లాడుతూ, ‘రామ్ తల్లూరి ముందు నుంచి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాగే బెక్కం వేణుగోపాల్ చెప్పిన మార్పుల్ని బడ్జెట్ చూసుకోకుండా చేశాం. టీజర్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చిన తనికెళ్ల భరణికి ప్రత్యేకంగా కతజ్ఞతలు. ప్రేక్షకులు ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
‘ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంచి సర్‌ప్రైజ్ ఉంది. కచ్చితంగా అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని హీరో ఎస్ ఎస్ సైదులు చెప్పారు. హీరోయిన్ భ్రమరాంబికా మాట్లాడుతూ, ‘1980లో రాధే కష్ణ అప్పటి పరిస్థితులకు తగినట్టు ఈ సినిమాని తీశారు డైరెక్టర్ ఇస్మాయిల్. విజువల్‌గా పాషా ఇంకా బాగా చూపించారు. మ్యూజిక్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది’ అని తెలిపారు. ‘తనికెళ్ల భరణిని అప్రోచ్ అవ్వడానికి సపోర్ట్ చేసిన మహేంద్ర సింగ్ మాస్టర్‌కి కతజ్ఞతలు. భరణి వాయిస్‌తో టీజర్‌కి ఒక కొత్త ఫీల్ వచ్చింది. అదేవిధంగా బెక్కం వేణుగోపాల్ క్లైమాక్స్‌కి చేసిన సజెషన్స్ బాగా హెల్ప్ అయ్యాయి. తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అని దర్శకుడు ఇస్మాయిల్ షేక్ చెప్పారు.