సహా చట్టం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ- రామారెడ్డి
 మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద సమాచార హక్కు చట్టం నూతన క్యాలెండర్ను శుక్రవారం తాసిల్దార్ రోజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహ చట్టం 2005 పై, సమాచార హక్కు చట్టం సభ్యులు ప్రజలకు వివరించడం అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సంకి రతన్ కుమార్, జిల్లా ఆర్గనైజర్ చిన్నస్వామి, మండల అధ్యక్షులు రమేష్, సభ్యులు మోహన్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.