చట్టం తన పని తాను చేస్తోంది

– అబ్కారి శాఖ మంత్రి జూపల్లి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చట్టం తన పని తాను చేస్తోందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జన్వాడ వద్ద కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలకు చెందిన ఫామ్‌హౌస్‌పై దాడి కేసుకు సంబంధించి మంత్రి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిర్యాదు వచ్చినప్పుడు సోదాలు చేయడం పరిపాటేనని తెలిపారు. ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎలాంటి అనుమతి ఎక్సైజ్‌ శాఖ నుంచి తీసుకోలేదని చెప్పారు. ఈ దాడుల్లో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ (విదేశీ మద్యం) స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.