
జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం పట్టణంలో పర్యటించారు. వరి కొనుగోలు కేంద్రాల పరిశీలనలో భాగంగా వచ్చిన మంత్రికి నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు కొనపత్రి కవిత కాశీరాం, మేడిదాల సంగీత రవి గౌడ్, ఆకుల రాము తదితరులు పాల్గొన్నారు.