కమిషనర్ ను మర్యాదపూర్వకంగ కలిసిన సీఐటీయూ మున్సిపల్ యూనియన్ నాయకులు

– డ్రైవర్ల వేతనాల కోత విధించటం పై వినతిపత్రం.
నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నగర కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మల్యాల గోవర్ధన్, డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులతో కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ నీ పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మేడే కానుకగా పారిశుద్ధ్య కార్మికులకు వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచి అమలు చేస్తున్నది, కానీ డ్రైవర్లకు చెల్లించిన 2000 వేతనాన్ని, తిరిగి మళ్లీ రికవరీ చేసుకోవడం సిఐటియు గా తీవ్రంగా ఖండిస్తున్నాం, బడ్జెట్ సాకు చూపి నోటికందిన అన్నాన్ని గుంజుకునే చర్యలకు నిజామాబాద్ లిటీలలో పెరిగిన వెయ్యి రూపాయలు అందిస్తున్నప్పటికీ నిజామాబాద్ నగర పాలక సంస్థలో కోతలు విధించడం అన్యాయమని అన్నారు, కోత విధించిన వేమున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం, అధికారులు వ్యవహరించడం దారుణం అన్నారు, డ్రైవర్లు కూడా పారిశుద్ధ్య కార్మికులేనని రాష్ట్రంలోని అన్ని మున్సిపాతనాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు చంద్రసింహ, కార్యదర్శి భూపతి డ్రైవర్స్ యూనియన్ నాయకులు లక్ష్మణ్, వినోద్, వెంకటేష్, మారుతి, నరేష్, నవీన్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.