మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన గౌడ జన హక్కుల పోరాట సమితి నాయకులు

 నవ తెలంగాణ – నూతనకల్
ఇటీవల మండల కేంద్రానికి చెందిన నాగార్జున హైస్కూల్ కరస్పాండెంట్ ఈనాడు రిపోర్టర్ మారగాని వెంకన్న గౌడ్ మాతృమూర్తి మారగాని జయమ్మ అనారోగ్యంతో మృతి చెందింది . శుక్రవారం గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు బిక్కి బుచ్చయ్య గౌడ్, చిత్తలూరి నారాయణ గౌడ్ లు మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఆ సంఘ మండల అధ్యక్షులు మారగాని మారయ్య, నాయకులు కనకటి మహేష్ గౌడ్ జి శ్రీనాథ్ టీ వెంకన్న, తోట్ల ఉపేందర్, తదితరులు ఉన్నారు.