– వనపర్తి ,మహబూబ్‌నగర్‌లో ఆసక్తిరమైన రాజకీయాలు
– అభ్యుదయం తెలంగాణ వాదం నీరంజన్‌రెడ్డి
– అయితే తెలంగాణ వాదమే శ్రీనివాస్‌గౌడ్
– మంత్రుల వైపు ఉమ్మడి జిల్లా ప్రజల చూపు
ఒకరిది అభ్యుదయం, తెలంగాణ వాదమైయితే… మరొకరిది గజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులుగా తెలంగాణ రాష్ట్రం కోసం చివరి వరకు పోరాటాలు చేసిన వ్యక్తి మంత్రి శ్రీనివాస్‌గౌడ్. ఇద్దరిదీ ఉద్యమ నేపత్యమే. నీరంజన్‌రెడ్డి వృత్తి రిత్యా న్యాయవాది. ఆయన విద్యార్థి దశలో అబ్యుదయ సంఘం పీడీఎస్‌యూలో పనిచేవారు. చిన్ననాటి నుంచి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఆయన పేదలకు సహాయ సహాకారాలు అందించేవాడు. ఇక మహబూబ్‌నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీనివాస్‌గౌడ్ ఉద్యోగరీత్యా ఆయన అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. ఆతర్వాత తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి రాష్ట్రం సాధించిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
మహబూబ్‌నగర్‌లో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్‌గౌడ్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా హైదరాబాద్‌లో పనిచేశారు. గజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయ కులుగా ఉంటూ.. తెలంగాణ జెఎసీలో కీలక పాత్ర పోషించారు. బీసీ సామాజిక వర్గం ఆయనకు అను కూలంగా పనిచేసింది. ఆతర్వాత 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా మహ బూబ్ నగర్ నుంచి గెలుపొందారు. 2018లోనూ గెలిచి మంత్రిగా బాద్యతలు చేపట్టారు. జిల్లా కేంద్ర ంలో చేసిన అభివృద్ధి పట్ల పట్టణ ప్రజలు సైతం ప్రశంసనలు వెదజల్లుతున్నారు. పట్టణ సుందరీకరణ, ట్యాంక్‌బండ్ పునరుద్దరణ, శిల్పకలల ఏర్పాటు శిల్పారామం వంటి అనేక పనులు చేసి ప్రజల మన్న నలు పొందారు. ఇక మంత్రి నిరంజన్‌రెడ్డి విద్యార్థి దశలోనే రాజకీయ నేర్చుకున్నారు. ఇతను వామపక్ష విద్యార్థి సంఘం అయిన పీడీఎస్‌యూలో విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేశారు. 2014 ఎన్నికలో పోటీ ఓడిపోయిన నిరంజన్‌రెడ్డి ఆర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఎంపికైయ్యారు. ఎమ్మెల్యేకు దీటుగా ఉండి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కాల్వలు ఖిలాఘనపూర్, గోపాల్‌పేట కుంటు సాగునీటిని తీసుకెళ్లారు. ఇంకా మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల, పిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆయన కృషి చేశారు.దీంతో ఇటు మహబూబ్‌నగర్, అటు వనపర్తిలో బీఆర్‌ఎస్ సానుకూల పవనాలు వీస్తున్నాయి.
కాంగ్రెసు ఎదురీత
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఉన్నా.. మహబూబ్‌నగర్, వనపర్తి నియోజకవర్గాల్లో ప్రతి కూల పరిస్థితులున్నాయి. వనపర్తిలో ఎంపీపీ మేఘారెడ్డికి గాకుండా మాజీ మంత్రి చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో అక్కడ మేఘారెడ్డి రేబల్‌గా పోటీ చేస్తే… కాంగ్రెస్‌కు నష్టం జరుగుతోంది. మహబూబ్‌నగర్‌లో సైతం కాంగ్రెస్‌కు ఎదురు గాలి వీస్తోంది. మహబూబ్‌నగర్‌లో యొన్నం శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్‌నుండి టికెట్ వచ్చింది. దీంతో స్థానిక నాయకులు అయిన సంజీవ్‌ముధిరాజ్, ఎన్‌పి వెంకటేష్, మాజీ డీసీసీ అధ్యక్షులు ఓబేదుల్లా కోత్వాల్‌లు యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ఏ మేరకు సహకరిస్తారో చూడాలి.