డిపిఓ ను కలిసి సన్మానించిన ఎంపీఓ ల సంఘం నాయకులు

నవ తెలంగాణ – కాటారం
జిల్లా పంచాయతీ అధికారిని ఆశాలతను ఎంపీఒ ల సంఘం నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గల డిపిఓ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో అవార్డు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇటి కార్యక్రమాన్ని చేపట్టారు. రాబోయే రోజుల్లో కూడా మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించి ఉత్తమ విశిష్ట సేవలు అందించాలని కూడా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు