
నిజామాబాద్ మార్కేట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన ముప్ప గంగా రెడ్డి కి మంగళవారం ఇందల్ వాయి సహకార సొసైటీ చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ రూరల్ అద్యక్షులు సంతోష్ రెడ్డి, మాజీ సహకార సొసైటీ చైర్మన్ మొచ్చ గోపాల్ తో కలిసి పుల బోకే, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లోనే ఉంటు పార్టీ అబివృద్ధి కి ఎళ్ళవేళల తోడ్పాటును అందిస్తు అందరిలోనూ ఒకరిగా ఉంటూ సహాయ సహకారాలు అందజేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మార్కేట్ కమిటీ చైర్మన్ గా నియమించారని, ముప్ప గంగా రెడ్డి హయాంలో మార్కేట్ కమిటీ అబివృద్ధి చేందుతుందని వారు అశాభావం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ఇందల్ వాయి మండలంలో మార్కేట్ కమిటీ ద్వారా అబివృద్ధి చేస్తారనే నమ్మకం ఉందని వారన్నారు.