
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈనెల ఆరవ తేదీన అమెరికా వెళ్లి పర్యటించి గురువారం ఉదయం జుక్కల్ నియోజకవర్గానికి చేరుకున్న సందర్భంగా మండలంలోని నర్సింగ్ రావు పల్లి చౌరస్తా జాతీయ రహదారి వద్ద కాంగ్రెస్ ఉమ్మడి మండల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా కార్యకర్తలతో కలిసి జుక్కల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి ఆయన బయలుదేరారు. కార్యక్రమంలో నాయకులు జయ ప్రదీప్, యూత్ అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్, ప్రజాపండరి, ఉమ్మడి మండల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.