నవతెలంగాణ-చెన్నారావుపేట
పేరుకే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. మద్దతు ధర మాటేమోగాని ఆ కేంద్రానికి వెళితే నిర్వాహకులు, మిల్లర్లు, వారిని ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రతినిధులు అన్నదాతలను నిలువుదోపిడీ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్‌రావు విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో న ర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్‌రావు మా ట్లాడుతూ రైతులు రాత్రింబవళ్లు కష్టపడి సాగుచేసిన ధాన్యాన్ని కల్లాల వద్దకు తీసుకొస్తే అధికారులు, మిల్ల ర్లు, సొసైటీలు నిలువునా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎలాంటి నియమ నిబంధనలు పెట్ట కుండా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని అధికా రులు నిబంధనలను బేఖాతర్ చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.కొనుగోళ్లలో సం చి దగ్గర 2 కిలోల ధాన్యం అదనంగా తీసుకుంటు న్నారని చెప్పారు. మిల్లర్లకు మాత్రమే ప్రభుత్వం తరు గు పేరుతో నూటికి రూ.10లు ఇస్తుంటే, మరో రూ. 10లు రైతుల నుంచి ఎందుకు వసూలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలా ఒక్కలారీకి రూ.35వేలు మిల్లర్లు లాభపడుతున్నారని అధికారుల దృష్టికి తీసు కువచ్చారు. ఈ విధంగా దగా చేస్తుంటే ప్రజాప్రతిని ధులను ఎందుకు నిలదీయడం లేదన్నారు. 2018 ఎన్నికలకు ముందు ఇస్తామన్న రుణమాఫీ ఇంకెప్పు డు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఆందోళనతో ప్ర ధాన రహదారిపై ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. దీంతో ఎస్సై తోట మహేందర్ సంఘటన స్థలానికి చేరుకొని నాయకులను సముదాయించి సం బంధిత అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడం ఆందోళన విరమించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మొగిలి వెంకటరెడ్డి, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు క ర్నాటి పార్వతమ్మ, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల జగ న్మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌ డ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు సిద్ధన రమేష్, తప్పెట రమే ష్, బండి పద్మ, మండల అధ్యక్షులు లక్ష్మణ్‌నాయక్, ఎర్రల్ల బాబు, రూపిక శ్రావణ్, నన్నే బోయిన రమేష్, మంచాలసదయ్య, సర్పంచ్ తోటిరమేష్ పా వని, అ మిరుద్దీన్, నరసయ్య, వీరేందర్‌నాథ్ పాల్గొన్నారు.