– ఐద్వా జాతీయ నాయకురాలు పుణ్యవతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘రీటా నేర్పిన పాఠం’ పుస్తకం ఎంతో స్ఫూర్తిదాయమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ నాయకురాలు ఎస్ పుణ్యవతి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఐద్వా జాతీయ ఉపాద్యక్షురాలు సుధా సుందరరామన్ అవిష్కరించారు. అనంతరం పుణ్యవతి మాట్లాడుతూ బందా కరత్ తన యవ్వన ప్రాయనంలోనే దేశంలోని వివిధ సమస్యలపై స్పందించారని చెప్పారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. ఆ పుస్తకంలో ప్రతి అంశం మహిళా ఉద్యమాలకు ప్రేరణగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, అధ్యక్షురాలు అర్, అరుణజ్యోతి, ఉపాధ్యక్షురాలు టి. జ్యోతి, కె.ఎన్. ఆశాలత, రత్నమాల, సరళ, డి. ఇందిర, ఎమ్, భారతి, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.