– బీఆర్‌ఎస్ నాయకులు
నవతెలంగాణ – చైతన్యపురి
మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని విమర్శించే స్థాయి బేర బాలకిషన్‌కు లేదని బీఆర్‌ఎస్ సరూర్ నగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు ఆకుల అరవింద్ కుమార్, ఇంటూరి అంకిరెడ్డిలు మండిపడ్డారు. సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు బేర బాలకిషన్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. ఆదివారం అంకిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం మారగానే పార్టీ మారిన నువ్వు సబితా ఇంద్రారెడ్డి గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. సరూర్ నగర్ డివిజన్‌లో నీ వల్ల ఒక్క కుటుంబానికైనా మేలు జరగలేదని బేర బాలకిషన్‌ను విమర్శించారు. డివిజన్ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసే సబితా ఇంద్రారెడ్డిని అనే స్థాయి నీకు లేదని, స్థాయి మరిచి మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నువ్వు పార్టీ మారిన రోజు నీతో కనీసం ఒక్కరు లేరని, ఏం మొఖం పెట్టుకొని మాట్లాడుతున్నావని ఎద్దేవా చేశారు. ఆనాడు నీ కుటుంబం అవసరాల కోసం సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో పనిచేసి.. నీ ఇద్దరు బిడ్డలకు అవుట్ సోర్సింగ్ జాబ్స్ పెట్టించుకున్న విషయాన్ని మర్చిపోవద్దని బేర బాలకిషన్‌కు గుర్తుచేశారు. నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి చేసిన అభివద్ధి, సంక్షేమాన్ని గ్రహించిన ప్రజలు ఆమెను ఆదరించి మళ్లీ గెలిపించారని ఆ విషయాన్ని బేర గ్రహించాలన్నారు. రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను అమాయకుల మీద పెట్టి బెదిరింపులకు పాల్పడ్డ నువ్వా.. జాతి గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. బ్లాక్మేలింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేసే నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడడాన్ని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. సరూర్ నగర్, ఆర్కేపురం డివిజన్లలను అభివద్ధి చేసింది ఎవరనీ ఏ చిన్నపిల్లగాన్ని అడిగినా సబితా ఇంద్రారెడ్డి పేరు చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, నియోజకవర్గ మాజీ యూత్ వింగ్ అధ్యక్షుడు లోకసాని కొండల్ రెడ్డి, సుదామ, పి. రాజు, రిషి, కొండగిరిగౌడ్, సిరిపురం రాజేష్, ప్రత్యూష్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.
సబితమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదిలేదు..
– బీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షులు సీహెచ్. నాగరాజు
నవతెలంగాణ – మీర్ పేట్
మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షులు సీహెచ్. నాగరాజు ఇతర పార్టీ నాయకులను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు బేరా బాలకిషన్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ఏ పార్టీ నాయకులు అయిన వ్యక్తిగతంగా దూచించడం సరికాదన్నారు. అభివద్ధి పనులు, ఇచ్చిన హామీలను ఆధారంగా విమర్శలు చేయాలి తప్ప.. వ్యక్తిగత జీవితంపై దూషణలు చేయడం సరికాదన్నారు. బాలకిషన్ సబితమ్మ అధికారంలో ఉన్నప్పుడు తన వెంట తిరిగి సొంత పనులు చేయించుకుని.. ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి అధికారంలో ఉన్న పార్టీలో చేరి మాజీ మంత్రిని స్థాయికి మించి విమర్శలు చేయడం సరికాదన్నారు. విమర్శించే అర్హత కూడా నీకు, పార్టీకి లేదనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. సబితమ్మ దగ్గరికి వచ్చి మీ కూతురుకి మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇప్పించుకున్నావా లేదా అనేది అప్పుడే మర్చిపోయావని గుర్తుచేశారు. అభివద్ధి విషయానికొస్తే మహేశ్వరం నుండి సరూర్నగర్ వరకు ఎంత డెవలప్మెంట్ చేశారో నీ కళ్ళకు, నీ కాంగ్రెస్ పార్టీ కళ్ళకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. సబితమ్మను, బీఆర్‌ఎస్ పార్టీని, నాయకులను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరరించారు.