లయన్స్ క్లబ్ నిత్య అల్పాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

నవతెలంగాణ – పెద్దవంగర
లయన్స్ క్లబ్ పెద్దవంగర ఆధ్వర్యంలో అందిస్తున్న నిత్య అల్పాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఏదునూరి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిత్య అల్పాహార కార్యక్రమం నిర్వహణలో భాగంగా దాతలు ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి-మంజుల అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఏదునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ..అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, అన్ని దానాల కన్నా అన్నదానం మహా గొప్ప ధానం అని తెలిపారు. శరణార్థులకు ఆకలిని తీర్చడం మహా పుణ్యమని, ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఎవరికో ఒకరికి అన్నదానం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి మొర్రిగాడుదుల శ్రీనివాస్ గౌడ్, ప్రతినిధులు తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, అనపురం రవి గౌడ్, సుభాష్ చంద్ర బోస్ కుమార్, ఏదునూరి రేణుక‌ తదితరులు పాల్గొన్నారు.