పెరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని మాల మహానాడు మునుగోడు నియోజకవర్గ కన్వీనర్ మహేశ్వరం కిష్టయ్య పిలుపునిచ్చారు.ఆదివారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం,కైతాపురం, ధర్మాజీగూడెం గ్రామాలలో సింహ గర్జన విజయవంతం చేయాలని ప్రచారం నిర్వహిస్తూ,వాల్ పోస్టర్లు,కరపత్రాలు ఆవిష్కరించారు,ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ డిసెంబర్ 1 న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మాలల సింహగర్జనకు మాలలు లక్షలాదిగా తరలి రావాలన్నారు,మాలలంతా ఐక్యతగా, సంఘటితమై కలిసికట్టుగా ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు.ఎస్సీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.అవకాశవాద రాజకీయాల కోసం బిజెపి ఎస్సీలను విభజించిందని దుయ్యబట్టారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు తీవ్ర అన్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు.డిసెంబర్ 1న హైదరాబాదులో నిర్వహించే సింహగర్జనకు స్వచ్ఛందంగా మాల ఉద్యోగస్తులు,మాల కులస్తులందరూ లక్షలాదిగా తరలివచ్చి మాలల సత్తా చాటాలని కోరారు.రాష్ట్రంలో మన మాల సామాజిక వర్గం అసలు లేరనే ఒక అబద్ధపు ప్రచారాన్ని ఒక సామాజిక వర్గం పనికొట్టుకొని ప్రచారం నిర్వహిస్తున్నది అలాంటి వాటికి చెంపపెట్టుగా మన సింహగర్జన బహిరంగ సభ విజయవంతనికి ప్రతి ఒక్కరూ సహకరించి తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల లింగస్వామి స్థానిక నాయకులు యనమల నాగరాజు,తగరం వెంకటేశం,మంత్రి యాదయ్య,వల్లబోతు భాస్కర్,బొంతల రవీందర్,సంగం నర్సింగరావు,వల్లబోతు లక్ష్మయ్య,దౌడీ యాదయ్య,బొంతల యువరాజ్, దౌడీ యాదయ్య,వల్లబోతు సురేష్,సంగం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.