కాంట్రాక్ట్ టీచర్ల బతుకులు మారాలి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల బతుకులు మారాలని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రావడానికి ముఖ్య కారణం బతుకమ్మ పండుగ అని అ పండుగ త్వరలో వస్తుందని కాంట్రాక్ట్ టీచర్ల బతుకులు మారాలని పేర్కొన్నారు.దానిలో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ లో కాంట్రాక్ట్ టీచర్లు అందరూ సమిష్టిగా బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరిగిందని, మా జీవితాల్లో వెలుగుల్ని నింపాలని సీఎం కెసిఆర్ మనింట్లో దయ చుపలని, ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని వెడుకున్నరు. కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరావు, డాక్టర్ అపర్ణ, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ జోష్ణ, డాక్టర్ స్వామి రావు, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ సురేష్, డాక్టర్ రాజేశ్వర్, జలంధర్ ,డాక్టర్ మోహన్, నాగేంద్రబాబు, గోపి రాజ్, జి శ్రీనివాస్, కిరణ్ రాథోడ్, డాక్టర్ శ్వేత, డాక్టర్ డానియల్, డాక్టర్ గంగ కిషన్, డాక్టర్ బి ఆర్ నేత, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.