పాలస్తీనా పిల్లల ప్రాణాలే లక్ష్యంగా..

Palestinian children's lives are the target.పాలస్తీనాకు చెందిన గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడిలో హతులవు తున్న వారిలో పిల్లల శాతం ఎందుకు ఎక్కువగా ఉందో చెప్పటానికి లండన్‌ నుంచి వెలువడే ప్రముఖ పత్రిక ”ద ఎకనామిస్టు” ఒక వ్యాసంలో ప్రయ త్నించింది. రెండు బలమైన దేశాల మధ్య దీర్ఘ కాలంటీ కొనసాగుతున్న ఉక్రెయిన్‌ యుద్ధంలో చనిపోయిన దాదాపు 10వేల మంది పౌరులలో పిల్లల సంఖ్య కేవలం 550. కాబట్టి గాజాలో పిల్లలు ఎక్కువ సంఖ్యలో చని పోవటానికి ఒక ముఖ్య కారణం పాలస్తీనా జనాభాలోగల యువత ప్రాబల్యమేనని ”ద ఎకనామిస్టు” తేల్చింది. అయితే అసలు విషయం ఇజ్రాయిల్‌ ఉద్దేశపూర్వకంగా పౌరుల ను ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని మారణకాండను కొనసాగి స్తూ యుద్ధ నేరానికి పాల్పడుతోంది. దీనికి పశ్చిమ దేశాల మద్దతు ఉంది. ”ద ఎకనామిస్టు” రాసింది పాలస్తీనా లో జరుగుతున్న మానవ హననంపై పశ్చిమ దేశాల మీడియా రాస్తున్న కదనాలకు ఒక చక్కని ఉదాహరణ.
పాలస్తీనా పౌరుల ప్రాణాల విలువ, వేదన ఇజ్రాయిల్‌ పౌరుల ప్రాణాల విలువకు, వేదనకు సమానం కాదని చెప్పటమే ఇటువంటి కదనాల ఉద్దేశమని మిడిల్‌ ఈస్ట్‌ ఇన్స్టిట్యూట్స్‌ ప్రోగ్రాం ఆన్‌ పాలస్తీనియన్‌-ఇజ్రా యిలీ అఫైర్స్‌ డైరెక్టర్‌, ఖాలిద్‌ ఎల్జిండీ న్యూస్‌ వీక్‌ పత్రికకు వివరించాడు. ఇతరుల ప్రాణాలు అంతగా విలువైన వి కావనే భావన మానవ హననంలో ప్రధానాంశంగా ఉంటుందని 1948 లో జరిగిన యుఎన్‌ జనొసైడ్‌ కన్వేన్షన్‌ పేర్కొందని, పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ జరుపుతున్న మారణకాండ ఒక పాఠ్య పుస్తకంలో రాసినట్టుగా జరుగుతోం దని హౌలకాస్ట్‌ నిష్ణాతుడు రాజ్‌ సెగల్‌ అన్నాడు. పాలస్తీనాపై ఇజ్రా యిల్‌ సాగిస్తున్న మానవ హననాన్ని వివరించటంలో పశ్చిమ దేశాల ప్రభుత్వాలు, మీడియా చేస్తున్న వక్రీకరణలు ఇజ్రాయిల్‌ లోని ఫాసిస్టు పాశవికతను బలోపేతం చేస్తాయి. మరోవైపు పాలస్తీనా వాసులకు సహాయ సహకారాలను అందించాలని ఆశించేవారిని టెర్రరిస్టుల మద్దతుదా రులుగా ముద్రవేసి వారిపట్ల సహాను భూతి లేకుండా చేయటానికి ఈ వక్రీకరణలు ఉపయోగపడతాయి.
గాజాలో ఇజ్రాయిల్‌ కావాలనే పిల్లలను హతమారుస్తున్నదన్న వాస్త వాన్ని దాచిపెట్టి పిల్లల సంఖ్య ఎక్కు వగా ఉండటంవల్లనే చనిపోయిన వారిలో పిల్లలు ఎక్కవగా ఉంటున్నార ని ”ద ఎకనామిస్టు” ఎంతగా వక్రీకరి ంచినా అసలు విషయం దాగదు. ఇజ్రాయిల్‌ అనుంగు మిత్రదేశం అమె రికా ప్రకారం పాలస్తీనా వాసులను హింసించటం, చంపటం ఇజ్రాయిల్‌ తన స్వీయ రక్షణ హక్కును కాపాడు కోవటం కొరకే చేస్తోంది. నిజానికి ఇజ్రాయిల్‌ దురాక్రమణదారు. దురా క్రమణ చేసే దేశానికి స్వీయ రక్షణ హక్కు ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే. పాలస్తీనా వాసులు పిల్లల సంఖ్యను పెంచటాన్ని ఆయుధంగా వాడుతున్నందున ఇజ్రాయిల్‌ తన స్వీయ రక్షణ కొరకు వారిని లక్ష్యంగా చేసుకుని హతమార్చటం సరియైన చర్యేనని ”ద ఎకనామిస్టు” ప్రచురిం చిన వ్యాసం సమర్థిస్తోంది.
ప్రస్తుతం గాజాలో ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దురాక్రమణలో 10వేల మంది పాలస్తీనీయులు చపోయారు. వీరిలో సగం మంది పిల్లలు. ఇంతటి హేయమైన మానవ హననాన్ని సమర్థిస్తున్న అమెరికా ప్రపంచంలో ఒంటరి అవుతోంది. ఈ మారణ కాండను మానవాళి మరువదు. మన్నించదు.