
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లునాగార్జన రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట రూరల్ : రెండు లక్షల వరకు రుణమాఫీ ఏకకాలం లో చేస్తామని ఎన్నికల సందర్భంగాకాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానం ప్రకారం ఎలాంటి షరుతుల లేకుండా నిర్దిష్ట గడువులోగా రుణమాఫీ పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సూర్యాపేటమడల, పట్టణకమిటీల ఆధ్వర్యంలో ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద రైతుల తో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 567 లో అనేక నిబంధనలు విధించడం వల్ల రైతులు రుణమాఫీ పోందలేని పరిస్థితి నెలకొంది అన్నారు. రుణమాఫీ అమలులో అనేక నిబంధనలు వధించి రైతుల సంఖ్య కుదింపు చేయడం సరికాదని షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు రోజుకు ప్రకటన చేయడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది అని అన్నారు. ఇప్పటివరకు 22 లక్షల రైతు ఖాతాలో 17వేల 933 కోట్లు జమ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని,ఎన్నికల నాడు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు వరకు రైతు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి ఆచరణలో అనేక కొర్రిలు పెట్టి రైతు రుణమాఫీ 40 శాతం కూడా పూర్తి చేయలేదు అన్నారు.సూర్యాపేటజిల్లాలో లక్షలాది మంది రైతులు అర్హుల జాబితాలో ఉంటే మూడు విడతల్లో కలిపి కొద్దిమంది మంది రైతులకు రుణమాఫీ అయిందని అన్నారు.రాష్ట్రంలో 42 లక్షలు రైతుల అర్హులుగా ఉంటే కేవలం 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది మన జిల్లాలో 1 లక్షల 55 వేల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. మండలం, బ్యాంకులు, సోసెటి వారీగా పరిశీలిస్తే కొ్నిచోట్ల పది పదిహేను శాతం కూడా రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కోసం విడుదల చేసిన జీవో 567 సవరించి రేషన్ కార్డు నిబంధనలు తొలగించాలని కోరారు. రెండు లక్షల రూపాయలు పైన అప్పు ఉన్న దానితో సంబంధం లేకుండా ప్రభుత్వం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పహాణ నకల మీద రుణం తీసుకుని రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని,గతం లో పాస్ పుస్తకాలు ఉండి రుణం తీసుకుని ప్రస్తుతం పాసుపుస్తకాలు లేని రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు. రైతు బంధు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ జరిగినప్పుడు రుణమాఫీ లో సాంకేతిక సమస్యలు అంటూ కాలయాపన చేయడం సరికాదు అని అన్నారు. రుణమాఫీ కాక కొందరు రైతులు, రుణమాఫీ వచ్చి తిరిగి రుణాలు మంజూరు కాక మిగతా రైతులు పొలాలు వదిలి బ్యాంకులు చూట్టూ , వ్యవసాయ శాఖ కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని అన్నారు. తుది విడత గడువు పరకటించి ఆలోపు బ్యాంకు లో అప్పు ఉన్న ప్రతి రైతు కు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.రైతు భరోసా వెంటనే విడుదల చేసిరైతులను ఆదుకోవాలని కోరారు.అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్నా పేద, బడుగు బలహీన వర్గాల రైతాలకుపాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కు సంబంధించిన సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మేకనబోయిన శేఖర్,రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకట్ రెడ్డి, రైతు సంఘం నాయకులు నారాయణ వీరారెడ్డి, నాగిరెడ్డిశేఖర్ రెడ్డి, పందిరి సత్యనారాయణరెడ్డి, రెడ్డి మోహన్ రెడ్డి, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్,నల్ల మేకల అంజయ్య, కే.లింగయ్య, జి.పుల్లయ్య, కోడి ఎల్లయ్య, కొల్లూరి బాబుతదితరులు పాల్గొన్నారు.