రుణమాఫీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి

నవతెలంగాణ-సిద్దిపేటకలెక్టరేట్‌
రైతులకు రుణమాఫీ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. సమీకత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని బ్యాం కు అధికారులు, వ్యవసాయ అధికారులతో రైతుల రుణమాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ గురించి జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌తో కలిసి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ము ఖ్యంగా ఏపీజీవీబీలో 8000 మంది రైతులకు గాను రూ. 60కోట్లు, ఎస్బీఐలో 6000 మంది రైతులకు గాను రూ.35కోట్లు, యుబీఐలో 4000 రైతులకు గాను రూ.20కోట్లు, ఇతరత్రా బ్యాంకులలో సుమారు 4000 అకౌ ంట్లకు గాను రూ.50కోట్ల పెండింగ్‌ రైతు రుణమాఫీ నగద ును వేగంగా రైతులకు అందజేయాలన్నారు.డీబీటీ పెల్యుర్‌ 256 పెండింగ్‌లో ఉన్న అకౌంట్లకు రైతు రుణమాఫీ ఫోర్టల్‌లో ఎస్బీఐ, ఎపిజివిబి బ్యాంకుల్లో అప్లోడ్‌ చేయాలని అదేశించారు. వివిధ బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న రుణా లను త్వరగా పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు ఏడీఏ, ఏఓలు బ్యాంకర్ల దగ్గర నుంచి వివిధ గ్రామాల్లో పెండింగ్‌ జాబితాను తీసుకోవాలన్నారు. బ్యాంకు మేనేజర్లు, ఆర్‌ఎంలు పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని వేగంగా తనకు అందించాలన్నారు. సమావేశాలకు బ్యాంకర్ల ఆర్‌ఎ ంలు కచ్చితంగా హాజరుకావాలని లేని పక్షంలో కఠిన చర్యల ు తీసుకోవాలని హెచ్చరించారు. కొత్త రుణాలు అందు కునేందుకు అర్హత కలిగిన రైతుల వద్దకు వ్యవసాయ అధికా రులు వెళ్లి రుణాలకు సంబంధిత విషయాల గుర్చి తెలపాల న్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులందరితో రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి క్రాప్‌లోన్లు తీసుకునేలా రైతులను ప్రేరణ కల్పించాలన్నారు. ఎస్బీఐ, యూబీఐ,ఏపీజీవీబీ మరి యు కోఆపరేటివ్‌ బ్యాంకు రోజుకు 100చొప్పున రుణాలను అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ మాట్లాడుతూ.. వీధి వ్యాపార రుణాలను మున్సిపాల్టీ పరిధిలో 3500 మందికి వారం రోజుల లోపల మెప్మా అధికారుల సహయంతో బ్యాంకు మెనెజర్‌ లు అందించాలని అదేశించారు. సెర్ప్‌లో 136 ఎంసిబిలకు గాను 11కోట్లు మరియు మెప్మా పరిధిలో గల 75ఎంసి బిలకుగాను రూ.7కోట్లు బ్యాంకు లీంకెజిలో వారంలోపు పూర్తి చేయాలన్నారు. ఆహార ఉత్పత్తి పీఎంఎప్‌ఎంఈ పరిధిలో గల 94యూనిట్లు వేగంగా పూర్తి చేయాలన్నారు. ట్రైకర్‌ లోన్‌ పెండింగ్లో ఉన్న 20 రుణాలు, 131 ఎస్సీ కార్పొ రషన్‌ రుణాలను క్యాంపులు పెట్టి వారంలోపు పూర్తి చేయా లన్నారు. ఈ సమావేశంలో లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ సత్యజిత్‌, డిఆర్డిఏ పీడీ జయదేవ్‌ ఆర్యా, ఎస్బీఐ ఆర్‌ఎం అరుణ్‌ జ్వోతి, యుబిఐ డిఆర్‌ఎం రాఘవ రిజనల్‌ అధికారులు, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.