నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రుణమాఫీ జీవోను రైతుల రుణమాఫీకి ప్రయోజనకరంగా సవరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.567 తేది. 15`7`2024 ప్రకారం రైతుల రుణమాఫీకి రూపొందించిన నిబంధనలలో గల అంశాలను సవరించాలనారు. ప్రభుత్వ జీవో ప్రకారం రేషన్‌కార్డు ఆధారితంగా ఉన్నవారందరినీ ఒకేకుటుంబంగా పరిగణించి, కుటుంబంలో ఒక వ్యక్తికే రుణమాఫీ వర్తింపజేయడం వలన కుటుంబంతో విడిపడినవారికి రుణమాఫీ వర్తించదనీ, ఆదార్‌కార్డు, పాస్‌బుక్ డేటా, పిడిఎస్(రేషన్‌కార్డు డేటా) ఒకటిగా ఉన్న వారికే వర్తింపచేశారు. ఆదార్‌కార్డు లేని వారు, పాస్‌బుక్, రేషన్ కార్డు లేని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయనీ, పాసు పుస్తకాల కొరకు ధరణిలో 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ ప్రజాపాలన సర్వేలో తేలిందనారు.
రేషన్‌కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. వ్యవసాయం కొరకు రుణం తీసుకున్న సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్స్ (స్యయం సహాయక బృందాలు) జాయింట్ లయబిలిటీ గ్రూప్, రైతు మిత్ర గ్రూప్, కౌలుదారులకు ఇచ్చిన లోన్ ఎలిజబిలిటీ కార్డు ఉన్న వారికి రుణ మాఫీ వర్తించదని ప్రకటించారు. వాస్తవానికి ఈ నాలుగు గ్రూపుల్లోని వారు అత్యంత పేదలే కాక దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల్లో ఉండి వచ్చిన వారే ఎక్కువ. రీ`షెడ్యూల్డ్ చేసిన రుణాలకు కూడా రుణమాఫీ వర్తించదని నిబంధన చెబుతున్నదనీ, చాలామంది రైతులు రెండు లక్షలకు పైగా బాకీలు ఉన్నప్పటికీ గతంలో ప్రకటించిన 2014,2018 రుణమాఫీ పథకాలు వారికి వర్తించలేదనీ, అట్టి వారికి రుణం రెండు లక్షలకు పైగా ఉందనీ, వారు అప్పు చెల్లించగలిగిన స్థితిలో లేరనీ, ప్రస్తుతం వానాకాలం పంటలు వేయడం ప్రారంభించడంతో రైతుల పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నారు. జూన్` సెప్టెంబర్ మధ్య రెండు లక్షలకు పైగా ఉన్న అప్పు చెల్లించడం సాధ్యం కాదు. పిఎం కిసాన్ డేటాకు రుణమాఫీని జోడిరచడం వలన చాలా మంది రైతులు రుణమాఫీ అర్హత కోల్పోతారు. రాష్ట్రంలో 72లక్షల మంది రైతులు ఉన్నప్పటికీ బ్యాంకులు 43లక్షల మందికి మాత్రమే అప్పులిచ్చాయి. పిఎం కిసాన్ పథకం కింద 31 లక్షల మందికే వర్తింపజేశారు. అందువలన పిఎసం కిసాన్ డేటాను వర్తింపజేయడం వలన అర్హత కలిగిన వారు రుణమాఫీ పొందలేకపోతారు. 12.12.2018 నుండి 9.12.2023వరకు ప్రకటించిన రుణమాఫీని వర్తింపజేయడానికి కొన్ని బ్యాంకులు జనవరి2024 నుండి రుణాలను కొత్త రుణాలుగా రీ`షెడ్యూల్ చేశాయి. గతం నుండి బ్యాంకులు ‘‘బుక్ అడ్జెస్ట్‌మెంట్’’ ద్వారా రైతులకు రుణాలు పెంచుకుంటూ వస్తున్నాయి. అందువల్ల 9.12.2023 తర్వాత రీ`షెడ్యూల్ చేసిన రుణాలకు లేదా బుక్ అడ్జెస్ట్‌మెంట్ చేసిన రుణాలకు రుణమాఫీని వర్తింపజేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది. ఇందుకు అనుగుణంగా జీవోను సవరించాలని కోరారు.