పొంచి ఉన్న ప్రమాదం.. నిజాంసాగర్ కాలువలో నీళ్ల ప్రవాహం

నవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ సమీపంలోని సోమవారం నిజాంసాగర్ కెనాల్ కట్ట తెగి ఇళ్లల్లోకి నీళ్లు చేరి జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఇదే నిజాంసాగర్ కెనాల్ కాలువ మండలంలోని అంకాపూర్ నుండి మామిడిపల్లి ద్వారా గోవింద్ పెట్ తదితర గ్రామాల రైతాంగానికి సాగునీరు అందించే దిశగా నీటి ప్రవాహం ఎక్కువగా వదులుతున్నారు. దీంతో మామిడిపల్లి కెనాల్ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి పై వరకు నీళ్లు రావడం తో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు గమనించి కెనాల్ లో పుడకతీత పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.