కాజేసిన ఖాజానను రికవరీ చేసి టియు అభివృద్ధికి వాడాలి

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో వీసీ ప్రజాధనాన్ని ఖజేశాడాని , ఆ డబ్బుల్ని రికవరీ చేసి యూనివర్సిటీ అభివృద్ధికి వాడాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని ద్వారాకనగర్ ఇఫ్టు కార్యాలయంలో పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ వీసీ 50 వేలు లంచం తీసుకుంటున్న సందర్భంలో ఏసీబీ అధికారులు పట్టుకోవడన్నీ స్వాగతిస్తున్నామని, యూనివర్సిటీలో వీసీ అవినీతికి సహకరించిన వారందరినీ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థి సంఘాలుగా పోరాటాలతో దిగివచ్చి రైడ్ చేసినటువంటి ఏసీబీ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, పాలక మండలి సమావేశలలో తీసుకున్న తీర్మానాలను పక్కాగా అమలు చేయాలని, యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని, బోధనను గాడిలో పెట్టాలని, యూనివర్సిటీలో అవినీతి జరిగితే పి.డి.ఎస్.యూ సహించబోదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ నాయకులు మనోజ్, విజయ్, రంజిత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.