నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
మధ్యాహ్న భోజన ఏజెన్సీ బిల్లులు చెల్లించాలని శుక్రవారం నాగిరెడ్డిపేట మండలంలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు ప్రారంభించిన సమ్మె శనివారం కొనసాగింది. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేంతవరకు సమ్మె కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపేట మండలంలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు పాల్గొన్నారు.