కామారెడ్డి మండల విద్యాశాఖ అధికారి అందుబాటులో లేకపోవడంతో గురువారం ఖాళీ కుర్చీకి భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ మాట్లాడుతూ.. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎంఈఓ వత్తాసు పలుకుతున్నడని, కామారెడ్డి మండల కేంద్రంలో ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, గత కొన్ని రోజుల నుండి మండల విద్యాశాఖ అధికారికి విన్నవించిన పట్టించుకోలేకపోవడం జరుగుతుందన్నారు. గురువారం స్థానిక కార్యాలయానికి వెళ్లి అక్కడ మండల విద్యాశాఖ అధికారి అందుబాటులో లేకపోవడం వలన ఖాళీ కుర్చీకి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. లిటిల్ స్కాలర్ పాఠశాల యజమాన్యం నిబంధనకు విరుద్ధంగా విద్యాసంస్థను నడిపిస్తున్నారన్నారు. గవర్నింగ్ బాడీ లేకుండానే ఇష్టానుసారంగా ఫీజులను విద్యార్థుల నుండి అధికంగా వసూలు చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు ఆడుకోవడానికి ఆటస్థలం లేకపోవడం వలన విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఐఐటి తరగతుల పేరుతో విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. మూత్రశయాలు, మరుగుదొడ్లు విద్యార్థులకు అనుగుణంగా లేవన్నారు. పరిమితికి మించి ఆ భవనంలో విద్యార్థులకు అడ్మిషన్లను తీసుకుంటున్నారన్నారు. ఇదే విషయం గతంలో విద్యాశాఖ విద్యాశాఖ అధికారులకు విన్నవించిన చర్యలు తీసుకోలేరన్నారు. విద్యను వ్యాపారం చేస్తున్న ఇలాంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు. లేని పక్షంలో భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ పేరుమల బుల్లెట్,భారతీయ యావ మోర్చ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నాయకులు ఆర్బాస్ ఖాన్, వంశీ తదితరులు పాల్గొన్నారు.