నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సరుకు రవాణా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో నమోదైందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఈ విభాగంలో 141.117 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.13,438.76 కోట్ల ఆదాయం వచ్చిందనీ, దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పడినప్పటి నుంచి ఇదే అత్యుత్తమ రికార్డు అని చెప్పారు. గతేడాది కంటే 8.785 మిలియన్ టన్నులు అధిక రవాణా జరిగిందన్నారు.ఈ సందర్భంగా రైల్వే సిబ్బందికి అభినందనలు తెలిపారు.