మండలంలోని మద్దికుంటలో వెలిసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం మాఘమా అమావాస్యను పురస్కరించుకొని భక్తులు పుష్కరిణిలో స్నానాన్ని ఆచరించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముక్కులు తీర్చుకున్నారు. భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. కామారెడ్డి నుండి దేవస్థానం వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోజరి లచ్చిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు ప్రభాకర్ స్వామి, గణేష్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.