
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రజాసంఘాల ఐక్యవేదిక (సీఐటీయూ.రైతు సంఘము.వ్యకస )ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10 తేదీన ఇంద్ర పార్క్ లో మహాధర్న ను అసంఘటిత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ను సవరించి మార్చిలో పెట్టబోతున్న తెలంగాణ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత నివ్వాలని కోరుతూ చేపట్టబోతున్న ఈ ధర్నాకు కార్మికులకు, రైతులకు, ప్రజలకు, మున్సిపల్, గ్రామపంచాయతీ, ఆశ, అంగన్వాడి మధ్యాహ్న భోజనంకార్మికులు ఐకేపీ. అసంఘటిక కార్మికులు ఇట్టి మహా ధర్నాకు అన్ని రకాల కార్మికులు ఇంద్రపార్క్ కు తారీలిరావాలన్నారు. మార్చిలో జరిగే బడ్జెట్లో అన్ని రకాల కార్మికులకు కనీస వేతన 26,000 ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సంక్షేమానికి బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కక్షపూరితంగా వ్యవరిస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలపైన అఖిలపక్షంతో ఢిల్లీలో ధర్నాల ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చు కానీ ఇవేమీ చేయకుండా తెలంగాణ నుండి బిజెపికి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది లోక్ సభ సభ్యులు ఉన్న రాష్ట్రం పట్ల బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి కేంద్ర బిజెపి సర్కార్ను బోనులో నిలబెట్టి ప్రజ క్షేత్రంలో ఎండబెట్టడం ద్వారానే రాష్ట్రానికి నిధులు రాబట్టడం సాధ్యమవుతుందన్నారు. అందుకు రాష్ట్రంలో అందరినీ కలుపుకోనీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూడా సంక్షేమ పథకాలను తగిన విధంగా కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక, కర్షక, పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది కావున రేపు జరగబోయే నిరసనలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, అన్ని ప్రజా సంఘాలు తరలిరావాలని పిలుపునిస్తున్నానన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతిరం, వ్యాకాశ జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రేణుక, సీఐటీయూ జిల్ల ఉపాధ్యక్షుడు కే రాజనర్సు, ఎస్ ఎఫ్ ఐ జిల్ల అధ్యకులు ముధం అరుణ్ తదితరులు పాల్గొన్నారు.