12 న జరిగే మహాధర్నా విజయవంతం చేయాలి..

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
నెల 12 న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్మ సమాజ్ పార్టీ చేపట్టే మహాధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ ఉపాధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్ కోరారు. గడప గడపకు ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం పోతారం(ఎస్) గ్రామంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 సంవత్సరాలు గడిచిన కూడ దేశంలో రాష్ట్రంలో మెజారిటీ ప్రజల జీవితాలలో మౌలికమైన మార్పులు రావడం లేదన్నారు. భారత రాజ్యాంగ విలువలు, అందులోని అంశాలను ప్రజలకు తెలియనివ్వక పోవడం వల్లనే వెనుక పడుతున్నారన్నారు. ధర్మ సమాజ్ పార్టీ ప్రజలందరికీ భారత రాజ్యాంగ గ్రంథాల్ని ఉచితంగా అందించి, అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లన్న, భిక్షు, ప్రవీణ్, నరేష్, వెంకటేశ్ లు పాల్గొన్నారు.