
– ఇన్ఫినిటీ వ్యవస్థాపకులు రత్నాకర్
నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రపంచానికి తెలుగు రుచులు తెలపడమే తెలంగాణ ట్రీట్ ముఖ్య ఉద్దేశమని ఇన్ఫినిటీ వ్యవస్థాపకులు రత్నాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని బైపాస్ రోడ్ లో గల ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ కార్యాలయంలో తెలంగాణ చిప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టేస్టీ తెలంగాణ ట్రీట్స్ కుకింగ్ కాంపిటీషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ చెప్స్ అసోసియేషన్ నుండి తెలంగాణ షెఫ్స్ న్యాయ నిర్ణయితలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకులు రత్నాకర్, చెప్స్ అసోసియేషన్ కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ.. నేటి యువతరానికి కుకింగ్ కాంపిటీషన్ తెలంగాణ రుచులు ప్రపంచానికి తెలపడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, దీంట్లో భాగంగా కార్యక్రమానికి 30 నుండి 40 అప్లికేషన్లు వచ్చాయని, రాబోయే రోజుల్లో అన్లిమిటెడ్ అవకాశాలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా హోటల్ రంగంలో దినదిన అభివృద్ధి చెందుతున్న హోటల్ రంగంలో వారికి ఒక మోటివేషన్ ప్రాక్టీస్ చేసే విధంగా ఒక ప్లాట్ఫారం కావాలని ఇన్ఫినిటీ కళాశాలని తెలంగాణ చెఫ్ అసోసియేషన్ ఎన్నుకోవడం జరిగిందన్నారు. తాము నిజామాబాదులో ఇస్తున్నటువంటి ఇన్ఫ్రా స్ట్రక్చర్, విద్యా విధానము హైలీ ప్రొఫైల్ స్టాండర్డ్ లో కళాశాల నీ వారు గుర్తింపు చేసి తమకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమము ద్వారా వారు భవిష్యత్తులో ప్రొఫెషనల్ చేప్స్ గా ఎదిగే అవకాశం ఉందని, ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా నిరుద్యోగాన్ని కూడా నిర్మూలించవచ్చని అన్నారు. ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని ఈ హోటల్ రంగంలో చెఫ్స్ తో పాటు వివిధ రంగాలలో ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్, తెలంగాణ చెఫ్ అసోసియేషన్ సెక్రెటరీ నవీన్, నాగరాజు, సీరిల్, రిజ్వాన్, గణేష్ జోగి, రూడి తదితరులు పాల్గొన్నారు.