నీటిలో మునిగి వ్యక్తి మృతి..

నవతెలంగాణ డిచ్ పల్లి : డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని   మెంట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన  బియ్యం బాబాయ్య 66 వృత్తి  గేదెలను మెపటం, రోజు మాదిరిగానే సోమవారం ఉదయం సమయం లో  తన కూతురు లక్ష్మి కలిసి గేదెలను మెపడానికి మెంట్రాజ్ పల్లి గ్రామంలోని కొత్త చెరువు వద్దకు వేళ్ళరని, అదే రోజు సాయంత్రం అందజా 3 గంటలకు గేదెలు చెరువు లోనికి వెళ్లగా వాటిని చెరువు నుండి బయటకు రావడానికి నీటిలో వెళ్లిన బాబాయ్య చెరువు లో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు వివరించారు.మృతుని కూతురు వెంటనే చుసిన అయన అచుకి
దొరకలేదని మంగళవారం  మధ్యాహ్నం బాబాయ్య మృతదేహం లభించిందని తెలిపారు.మృతుని భార్య సాయమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మర్చూరికి తరలించినట్లు ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరిఫ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  పేర్కొన్నారు.