– డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో సీఐ శ్రీనివాస్ విచారణ
హుస్నాబాద్ రూరల్ : రాత్రి ఆరుబయట నిద్రపోయిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని కూచనపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గీకూరు నరసయ్య(55) సోమవారం రాత్రి ఇంటి బయట నిద్రించగా.. గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసి నరికి చంపారు. నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున స్థానికులు చూసి పోలీసులకు సమాచారమందించారు.