– రిమాండ్ కు తరలించిన పోలీసులు
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరం మేయర్ భర్త దండు శేఖర్ పై దాడి చేసిన వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు తరలించారు. ఈ మేరకు మంగళవారం కేశికి సంబంధించిన వివరాలతో కూడిన పత్రిక ప్రకటనలను పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి విడుదల చేశారు. సోమవారం సాయంత్రం నగర శివారులోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ప్రాంతంలో మేయర్ భర్త దండు శేఖర్ పై స్థానిక ఆటో డ్రైవర్ షేక్ రసూల్ దాడి చేసి గాయపరిచిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాడి దృశ్యాలను షేక్ రసూల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా మంగళవారం ఆటో డ్రైవర్ రసూల్ ను అరెస్టు చేసి విచారించిన పోలీసులు అనంతరం కోర్టు లో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. దాడికి ఉపయోగించిన వస్తువులు సెల్ఫోన్, సుత్తి, ఆటోను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీ తీసుకొని మరిన్ని కోణాలలో కేసును లోతుగా దర్యాప్తు చేస్తామని నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట్ తెలిపారు.ఈ కేసులో చాలా చక్కగా వ్యవహరించిన నాగారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.