ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించిన వ్యక్తి రిమాండ్

నవతెలంగాణ – శాయంపేట
ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించిన ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు పసుల శివరాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై సిహెచ్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన పసుల. శివరాజ్  గత నెల రోజుల నుండి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 2 న రాత్రి 8:30 గంటలకు బాధితురాలు కిరాణం దుకాణానికి  వెళ్లి వస్తుండగా, అదే అదునుగా చూసి మైనర్ బాలికను వేధించగా ఈ విషయం బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలియపరచినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పసుల శివరాజు@సుదర్శన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపారు.