ఐదేళ్ల బాలికను లైంగికదాడి, హత్య చేసిన వ్యక్తికి రెండు జీవిత ఖైదు జైలుశిక్షలు

– సంచలన తీర్పునిచ్చిన నిజామాబాద్ ప్రత్యేక హోప్సోకోట్ ఇంచార్జ్ సెషన్స్ జడ్జ్, నిజాంబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల
నవతెలంగాణ – కంటేశ్వర్
ఐదు సంవత్సరాల బాలికను లైంగికదాడి, హత్య చేసిన రెండు నేరాలలో ముద్దాయి దేవకత్తె గోవింద్ రావుకు రెండు జీవిత ఖైదు జైలుశిక్షలు విధిస్తు నిజామాబాద్ ప్రత్యేక పొక్సో కోర్టు ఇంచార్జీ సెషన్స్ జడ్జి సునీత కుంచాల శనివారం తీర్పు చెప్పారు. కోర్టు వెలువరించిన నలభై ఎనిమిది పేజీల తీర్పులోని వివరాలు. ఒక ఐదు సంవత్సరాల బాలిక మృతి కేసులో బాలిక తల్లి పిర్యాదు మేరకు డిచ్ పల్లి పోలిస్ స్టేషన్ హౌస్ అధికారి రూపొందించిన ప్రాధమిక నివేదిక అనుసారం తదుపరి నేరవిచారణ స్వీకరించిన నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్ బాలిక తల్లి, బంధువుల, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ముద్దాయి నేరం ఒప్పుకోలు స్వాధీన పంచనామ, సి.సి.టీవీ ఫుటేజీ, బాలిక పోస్ట్ మార్టమ్ రిపోర్ట్, ఫారెన్సిక్ నివేదికలతో పాటు ఇతర సాక్ష్యాలను జాతచేస్తూ అభియోగ పత్రాన్ని పొక్సో కోర్టులో సమర్పించారు. అభియోగ పత్రం ఆధారంగా నేర న్యాయవిచారణలో భాగంగా మొత్తం ఇరవై నాలుగు మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన ప్రత్యేక పొక్సో కోర్టు,ముప్పై ఐదు దృవీకరించున్న పత్రాలు, ఐదు వస్తుగత సాక్ష్యాలు అధ్యయనం చేసి కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన దేవకత్తె గోవింద్ రావు బతుకుతెరు వు కోసం హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ పరిచయం అయిన, అప్పటికే పెళ్లి అయి ఐదేళ్ల కూతురు, రెండేళ్ల కూతురు కలిగి ఉన్న ,భర్త విడిచి పెట్టిన వివాహిత మహిళతో సన్నిహితుడైనాడు.సదరు మహిళను వివాహం చేసుకుని డిచ్ పల్లి మండలం ధర్మారం(బి)లో ఒక వ్యయసాయదారుని వద్ద జీతం ఉన్నారు.బాలిక కాలికి గాయం కావడంతో 20 అక్టోబర్,2022 న చీకటి పడే సమయంలో అదే గ్రామంలోని ఆర్.ఎం.పి ప్రాక్టీసునర్ దగ్గర చూపించుకుని ఇంటికి రాకుండా మెంట్రాజ్ పల్లి వెళ్లే దారిలోని వ్యయసాయ పొలములోకి ఆ బాలికను తీసుకువెళ్లి బలవంతంగా లైంగిక దాడి చేశాడు.ప్రతిఘటించిన బాలికను శారీరకంగా గాయపరిచాడు. స్పృహ కోల్పోయిన బాలికను ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటి నుండి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్లిందని ఇప్పుడు ఇలా ఎందుకు అయిందని బాలిక తల్లి నిలదీయడంతో అత్యాచారం విషయం చెప్పాడు. బాలికను నిజామాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యుని సూచన మేరకు హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.అప్పటికే బాలిక మృతి చెందారు.బాలలపై లైంగిక వేధింపులు, దాడి నుండి రక్షణ చట్టం సెక్షన్ 5(¡)(m),ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 376(A),AB,376(2)(f) మరియు 302 హత్య సెక్షన్ల ప్రకారం నేరాలు రుజువు అయినట్లు నిర్థారిస్తూ సదరు సెక్షన్ల ప్రకారం అత్యాచారం నేరంకు గాను జీవిత ఖైదు, అత్యాచారం నేరమునకు పాల్పడి బాధితురాలి మరణమునకు దారితీసినందున హత్య నేరంకు గాను మరో జీవితం ఖైదు విధించారు. రెండు జీవిత కారాగార శిక్ష లన్ని ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు. బాలిక పేరెంటుకు 5 లక్షల పరిహారం.. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తరపున 5 లక్షల పరిహారం అందించాలని సెషన్స్ జడ్జి సునీత తమ తీర్పులో సూచించారు.