2023లో ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన మణిపూర్‌ హైకోర్టు

2023లో ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన మణిపూర్‌ హైకోర్టున్యూఢిల్లీ : మొయితీలను షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్‌టి) జాబితాలో చేర్చాలంటూ 2023లో ఇచ్చిన ఉత్తర్వులను మణిపూర్‌ హైకోర్టు సవరించింది. గురువారం కోర్టు ఇచ్చిన వివరణాత్మక ఉత్తర్వుల్లో.. మొయితీలను ఎస్‌టి జాబితాలో చేర్చడాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలను తొలగించింది. గిరిజనులను జాబితాలో చేర్చడం, మినహాయించడం అనే ప్రక్రియను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపడుతుందని కోర్టు తెలిపింది.
అయితే ఈ ఉత్తర్వులపై గతేడాది కుకీ కమ్యూనిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఎస్‌టి జాబితాను కోర్టులు సవరించడం, మార్పులు చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు గతంలోనే పేర్కొంది. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందినదని తెలిపింది.