మాస్‌ జాతర సందడి షురూ..

మాస్‌ జాతర సందడి షురూ..హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్‌ థ్రిల్లర్‌ ‘క’. నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై చింతా గోపాలకష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు ఈ సినిమాని తీసుకురాబోతున్నారు. ఈ సినిమా నుంచి ‘మాస్‌ జాతర ‘ సాంగ్‌ను ఈ నెల 7వ తేదీన విడుదల చేయబోతున్నారు. నేటి (శనివారం) ఉదయం 10.05 ఈ సాంగ్‌ ప్రోమో రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. సామ్‌ సీఎస్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సినిమా నుంచి ‘వరల్డ్‌ ఆఫ్‌ వాసుదేవ్‌..’ సాంగ్‌ ఇప్పటికే రిలీజై హ్యూజ్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుంది. ‘మాస్‌ జాతర’ సాంగ్‌ మీద కూడా మ్యూజిక్‌ లవర్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఈ సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్‌ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన వేఫరర్‌ ఫిలింస్‌ పై రిలీజ్‌ చేయబోతున్నారు.