శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో సామూహిక అక్షరాభ్యాస వేడుకలు..

నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని సోమవారం వైభవంగా పాఠశాల నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. భక్తులతో పాఠశాలలోని సరస్వతి మాత ఆలయ ప్రాంగణం జాతరను తలపించింది. దాదాపుగా 80 మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణోత్తములు పూర్వ విద్యార్థి బూరుగడ్డ శ్రీ నందన్ ఆధ్వర్యంలో సరస్వతి మాత జ్ఞాన యజ్ఞం నిర్వహించడం జరిగింది నిర్వాహకులు తెలిపారు. అలాగే విశ్రాంత సంస్కృతం రమాదేవి బుడెంగారి శారదా,ల ద్వారా చిన్నారులకు అక్షరాభ్యాస స్వీకారం జరిగింది. ప్రీ ప్రైమరీ విద్యార్థులు ప్రదర్శించిన విద్యావిషయక ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. వేడుకలను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలుక గట్టు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యా భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని శిశుమందిరాలలో సరస్వతి మాత పుట్టినరోజు, వసంత పంచమిని ఘనంగా నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యాస సంస్కారం చేయించడం అనేది ఎంతో విశిష్టమైనదని, ప్రతి సంవత్సరం ఈ వసంత పంచమి రోజున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం శిశు మందిర్ లో ఘనంగా నిర్వహిస్తామని వారన్నారు. సరస్వతి శిశు మందిరాలంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరని, అలాంటి సరస్వతి శిశు మందిర్ లో సరస్వతి మాత ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు ధన్యులని అని అన్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో చిన్నారుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తోపాటు తదితరులున్నారు