పత్తి క్వింటాల్ కు గరిష్ట ధర రూ.7000

నవతెలంగాణ –  జమ్మికుంట
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు శుక్రవారం కాటన్ విడి పత్తి 709 క్వింటాళ్లు 56 వాహనాలలో రైతులు విక్రయానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.7000 మోడల్ రూ. 6900 కనిష్ట ధర రూ. 6000 ఒక 100 పలికిందని మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి తెలిపారు. అలాగే కాటన్ బ్యాగ్స్ లలో 9 క్వింటాళ్లు ఐదుగురు రైతులు మార్కెట్ కు విక్రయానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.6000 మోడల్ ధర రూ.5900 కనిష్ట ధర రూ.5700 పలికింది. శని, ఆదివారాలు మార్కెట్ కు సాధారణ సెలవులు కాగా తిరిగి ఈనెల 19 సోమవారం మార్కెట్ పునః ప్రారంభం అవుతుందని కాబట్టి రైతులు గమనించి సహకరించాలని మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.