జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు కాటన్ విడి పత్తి 432 క్వింటాళ్లు 48 వాహనాలలో శుక్రవారం రైతులు విక్రయానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.6850, మోడల్ ధర రూ.6700, కనిష్ట ధర రూ.6500 పలికింది. అలాగే కాటన్ బ్యాగ్స్ లలో 16 క్వింటాళ్లు ఐదుగురు రైతులు విక్రయానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.6600 మాడల్ ధర రూ.6,500 కనిష్ట ధర రూ.6300 పలికిందని మార్కెట్ సెక్రటరీ ఆర్ మల్లేశం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శని, ఆదివారాలు మార్కెట్కు సాధారణ సెలవులు కాగా తిరిగి ఈనెల 25 సోమవారం మార్కెట్ పునః ప్రారంభం అవుతుందని కాబట్టి రైతులు గమనించి సహకరించాలని మార్కెట్ సెక్రటరీ కోరారు.