జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కాటన్ విడి పత్తి29 8క్వింటాళ్లు 38 వాహనాలలో సోమవారం రైతులు విక్రయానికి తీసుకురాగా గరిష్టదర 6900, మోడల్ ధర 6800, కనిష్ట దర 6,500 పలికింది. అలాగే కాటన్ బ్యాగ్స్ లలో ఏడు క్వింటాళ్లు ముగ్గురు రైతులు విక్రయానికి తీసుకురాగా గరిష్ట ధర 6600, మోడల్ ధర 6600, కనిష్ట ధర 65 6500 పలికిందని మార్కెట్ సెక్రటరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
– కాటన్ మిల్లులను సందర్శించిన మార్కెటింగ్ జిల్లా అధికారి
జమ్మికుంట పరిధిలో గల ఉన్న నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లులను సరిత కాటన్ ఇండస్ట్రీస్ ,సీతారామ కాటన్ ఇండస్ట్రీస్ , రాజశ్రీ కాటన్ మిల్లుల ను సోమవారం జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్ సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఉన్నత శ్రీణి కార్యదర్శి ఆర్ మల్లేశం తదితరులు ఉన్నారు.