నిజామాబాద్ నగరంలోని 20 వ డివిజన్ డివిజన్లో శుక్రవారం నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శాస్త్రి నగర్ లో లాల్ బహదూర్ శాస్త్రి పార్కు ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం 20వ డివిజన్ న్యూ బ్యాంక్ కాలనిలో పార్క్ ప్రహరీ గోడ, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు తో పాటు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.