
పాఠశాలల యందు విద్యార్థులకు మేను ప్రకారం భోజనం కచ్చితంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. జిల్లా కలెక్టరు, స్ధానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు, బుధవారం పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాధమిక పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించడం జరిగింది. మెనూ ప్రకారం భోజనం కచ్చితంగా ఉండాలని నిర్వాహకులకు అలాగే ఆయా పాఠశాలల ప్రదానోపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గద్దె గంగాధర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.