కొరం కోసం వేచి కోసం నిలిచిన సమావేశం

 

నవతెలంగాణ – మాక్లూర్

మండల సర్వ సభ్య సమావేశం కోరం కోసం 40 నిమిషాలు వేచి చూసి కోరం వచ్చిన తరువాతనే సమావేశం ప్రారంభించారు. మంగళవారం మండల కేంద్రంలో మండల సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 14 మంది ఎంపిటిసిలు ఉన్నారు. అందులో 1/3 సభ్యులు హాజరు అవుతెనే కోరంతో సమావేశం నిర్వహించాలి.  ఈ సమావేశానికి ఎంపిటిసిలు నలుగురు మాత్రమే సమయానికి  వచ్చారు. మరో వ్యక్తి 11.40 నిమిషాలకు రావడంతో సమావేశం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇందులో ఇద్దరు సర్పంచులు, నలుగురు ఎంపిటిసిలు, ఒక ఎంపిపి తో సమావేశం ప్రారంభించారు. తొమ్మిది మంది ఎంపిటిసిలు, 28 మంది సర్పంచులు లేకుండానే సమావేశం ప్రారంభించారు. అధికారులు మాత్రం ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉన్నారు. తరువాత ఒక్కొక్కరు సమావేశం ముగిసే సమయానికి వచ్చారు. సమావేశంలో అధికారులు వచ్చిన వారు వచ్చినట్లు వారి వివరాలను ప్రజా ప్రతి నిధులకు వివరించారు. చివరకు ఎంపిపి ప్రభాకర్ మాట్లాడుతూ అధికారులు మొరం మాఫియా, అధికారులు కలిసి మొరన్ని తరలించి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మచ్చ తీసుక వచ్చారని, దానిపై ప్రస్తున్న శాసన సభ్యులు ఆర్భాటం చేశారని గుర్తు చేశారు. ఇప్పడు నడుస్తున్న మాఫియాపై ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని అనుకోవలనాన్ని అన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మొరం మాఫియా పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేకపోతే అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుంటానని అధికారులకు హెచ్చరించారు. మాఫియాపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని కోరారు. అనంతరం సర్పంచులు పదవి కాలం ముగియడంతో సమావేశంలో పాల్గొన్న సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి సిక్కి సుజాత, ఎంపీడీఓ క్రాంతి, తహశీల్దార్ షబ్బీర్, ఇరిగేషన్ డీఇ గంగారాం, ఎంపిటిసిలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
బిల్లులు రాలేదని నేలపై కూర్చొని నిరసన
మండలంలోని మెట్ పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ చిన్నారెడ్డి తనకు ఎన్అర్జిఎస్ నిధులు గత రెండున్నర సంవత్సరాలుగా రావడంతో లేదని, పనులు చేసిన పంచాయతీ రాజ్ ఏఇ బిల్లులు చేయకుండా అప్పుల పాలు చేశాడని నేపపై కూర్చొని అవేదన వ్యక్తం చేశాడు. గతాబొరభుత్వంలో అధికారంలో ఉంది కుడ్ నిధులు ఇవ్వలేదని, ఇప్పటికైనా తను పెట్టిన నిదులను ఇప్పించలని డిమాండ్ చేశారు. రెండున్నర సంవత్సరాల క్రితం మూడు, ఐదు రూపాయలకు వడ్డీకి తెచ్చి పనులు చేశానని, ఇప్పటికీ నిధులు రాలేదని అవేదన చెందారు. చివరకు ఎంపిపి కలుగజేసుకొని తనకు నిధులు వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.