కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు సోమవారం స్టడీ టూర్ కి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వెళ్లారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, డైరెక్టర్ లతో సహా తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో వ్యవసాయ మార్కెట్ కమిటీల పనితీరు, కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి స్టడీటూర్ కి బృందంగా ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా చైర్మన్ పాలెపు నరసయ్య మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అండగా నిలుస్తుంది అన్నారు. స్టడీ టూర్ కి వెళ్ళిన వారిలో డైరెక్టర్లు భూత్ పురం మహిపాల్, రొక్కం సంపత్, జైడి శ్రీనివాస్, బనావత్ రాములు, లక్మ రంజిత్, కిష్టి చిన్న బాబన్న, కొరిపెల్లి లింగారెడ్డి, తదితరులు ఉన్నారు.