
పట్టణ వ్యాప్తంగా కుక్కలు, కోతుల బెడద తీవ్రమైంది. కాలనీవాసులు భయాందోళనకు గురవుతూ వాటి నుండి రక్షించాలని కోరుతున్నారు. ముఖ్యంగా పట్టణంలో సిద్దుల గుట్ట విస్తరించి ఉన్న కాలనీలలో కోతుల సమస్య తీవ్రంగా ఉంది. ప్రతినెల కుక్క, కోతుల వల్ల గాయపడిన వారి సంఖ్య 200 కు పైగానే ఉంటుంది. పట్టణంతో పాటు మున్సిపల్ లో విలీనమైన పెర్కిట్, మామిడిపల్లి లతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో కాలనీలలో కుక్కలు స్వైరా విహారం చేస్తున్నవి. అరికట్టడానికి మున్సిపల్ అధికారులు 10 లక్షలు నిధులు వెచ్చించి ఏ. బి .సి.( యానిమల్ బర్త్ కంట్రోల్) చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని ఒక్కొక్క కుక్కలను పట్టడానికి 1800 ఖర్చుతో శాస్త్ర చికిత్సలు చేసి పట్టించినారు. పట్టణంలో అరికట్టిన విలిన గ్రామాల్లో ఎక్కువగా ఉన్నవి.
పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో..
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు, హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నవి. ఇక్కడ కుక్క కాటు ,కోతికాటులకు వాక్సినేషన్ లు అందుబాటులో ఉన్నవి.
గోవింద్ పెట్, దేగాం.. పీహెచ్సీల పరిధిలో..
జిల్లాలోని గోవింద్ పెట్, ఎయిర్ గట్ల, ముచ్కూర్ పీహెచ్సీలకు కేంద్ర ప్రభుత్వం నుండి వ్యాక్సిన్ పర్మిషన్ లు రాకపోయినా గోవింద్ పెట్కు దే గం నుండి, ఏరుగట్లకు కమ్మర్ పెళ్లి నుండి, ముచ్చుకురు కు భీంగల్ నుండి వ్యాక్సిన్లు సరఫరా చేసుకుంటున్నారు. గోవింద పెట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు సబ్ సెంటర్లు ఐదు కాగా, మామిడిపల్లి ,పెర్కిట్ కు2, చేపూర్, ఫతేపూర్ ,గోవింద్ పెట్ లు ఉన్నవి. వైద్య అధికారులు ఇద్దరు కాగా ఒకరు డిప్యూటేషన్ అని, స్టాప్ నర్సులు నలుగురు కాగా ఇద్దరు డిప్యూటేషన్ లో ఉన్నారని, ల్యాబ్ టెక్నీషియన్లు ఇద్దరు ఫార్మసిస్టులు ఇద్దరు ఉన్నారని, యూ డి సీ పోస్టు ఖాళీగా ఉందని వైద్యధికారిని మానస నవ తెలంగాణకు తెలిపారు. దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అంకాపూర్ ,ఇస్సపెల్లి, ఆలూరు , దే గం మంతిని ,పిప్పిరి ,మగ్గిడి , కోమన్ పల్లి గ్రామాలు ఉండగా వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, సిబ్బంది కొరత లేదని వైద్య ధికారి గంగ దినేష్ తెలిపారు.
పట్టణంలో గత కొన్ని నెలల నుండి నమోదైన కేసులు..
కుక్కలను పట్టడం ఇతర ప్రాంతాలకు తరలించే కార్యక్రమం మున్సిపల్ అధికారులు చేపడుతున్న చర్యలు నీరుగారిపోతున్నవి. పెంపుడు జంతువులకు సంబంధించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాటిని తరలింపు ను అడ్డుకోవడంతో ప్రజల ఇబ్బందులు తులవడం లేదు. గత జూన్ నెల నుండి పట్టణ ప్రభుత్వాసుపత్రికి కుక్కకాట్లకు 203, కోతికాట్లకు148, జూలైలో 220,128, ఆగస్టులో 186,118,సెప్టెంబర్ లో 177,110 కేసులు నమోదు అయినట్టు వైద్య అధికారి తెలిపారు. ప్రభుత్వం స్పందించి పిహెచ్సి లలో వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.