
కిసాన్ నగర్ లోని మూడవ డివిజన్ లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని ,పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడమే లేదని కెవిపిఎస్ నగర కార్యదర్శి గాజుల కనకరాజు అన్నారు.దీంతో స్కూలుకు వెళ్లే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ,ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని అన్నారు.